తమ్ముడితో రాంచరణ్‌ సెల్ఫీ..

  • In Film
  • March 23, 2019
  • 164 Views
తమ్ముడితో రాంచరణ్‌ సెల్ఫీ..

అత్యంత భారీ
వ్యయంతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి
చేరుకున్నాయి.చిత్రంలో తమ అభిమాన హీరోల పాత్రల గెటప్‌లు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి
తారక్‌,చరణ్‌ల అభిమానులు వేల కళ్లతో ఎదురు చూస్తున్నారు.చిత్రంపై వస్తున్న ఊహాగాలను
నివృత్తి చేయడానికి దర్శకుడు రాజమౌళి కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి
పలు విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే.మీడియా సమావేశానికి చరణ్‌,తారక్‌లు ఇద్దరు
టోపీలు ధరించి మీసాలు,గడ్డాలతో హాజరయ్యారు.దీంతో ఇద్దరు లుక్స్‌ ఎలా ఉండనున్నాయోనని
అభిమానుల్లో ఆసక్తి ఎక్కువయింది.ఈ క్రమంలో రామ్‌చరణ్‌ తన తమ్ముడు వరుణ్‌తేజ్‌తో కలసి
తీసుకున్న సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది.రామ్‌చరణ్‌,వరుణ్‌తేజ్‌లు
ఇటీవల ఓచోట్‌ లంచ్‌కు మీట్‌ అయ్యారు.ఈ సమయంలో రామ్‌చరణ్‌ తన తమ్ముడు వరుణ్‌తో కలసి
తీసుకున్న సెల్ఫీకి సోదరుడి ప్రేమ అని కమెంట్‌తో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు.ఆర్‌ఆర్‌ఆర్‌
చిత్రంలో రామ్‌చరణ్‌ లుక్‌ ఇలానే ఉండనుందని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos