ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా ఊగిసలాట ధోరణితో మొదలయ్యాయి. ఉదయం 9.38 గంటలకు సెన్సెక్స్ 49 పాయింట్ల లాభంతో31,434 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో9,224 పాయింట్ల వద్ద ఆగాయి. ప్రీట్రేడింగ్లో మిశ్రమంగా ఉన్న సూచీలు ట్రేడింగ్ మొదలయ్యే సమయానికి నష్టాల్లోకి జారి పోయాయి. యెస్బ్యాంక్, హెక్సావేర్, జమ్ము కశ్మీర్ బ్యాంక్, టాటా స్టీల్ లాభాల్లో ఉన్నాయి. ఫ్యూచర్స్ రిటైల్, పీవీఆర్, ఎస్హెచ్ కేల్కర్ అండ్ కంపెనీ, ఎండ్యూరెన్స్ టెక్నాలజీ వంటి షేర్లు నష్ట పోయాయి.