న్యూ ఢిల్లీ : రాజ్యసభ వర్షాకాల సమావేశాలకు మొదటి రోజు అవాంతరం ఎదురైంది. విపక్షాల ఆందోళనతో సోమవారం ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ద్రవ్యో ల్బణం, జీఎస్టీ రేట్ల పెంపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ మధ్యలోకి దూసుకెళ్లారు. దీంతో సభను రేపటికి వాయిదా వేసినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.