రాజ్యసభలో ‘మీ నియంతృత్వాన్ని ఆపండి’ అని ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు

రాజ్యసభలో ‘మీ నియంతృత్వాన్ని ఆపండి’ అని ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు

న్యూఢిల్లీ : గురువారం డిఎంకె ఎంపీలు డిలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ టీషర్టులు ధరించి సభకు హాజరయ్యారు. దీంతో పలుమార్లు స్పీకర్‌ ఓంబిర్లా సభను వాయిదా వేశారు. శుక్రవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో కూడా వాడీవేడీగా చర్చ నడుస్తోంది. రాజ్యసభలో హోం మంత్రిత్వ శాఖ పనితీరుపై చర్చ నడుస్తోంది. మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు ఆయుష్‌, హెల్త్‌ అండ్‌ న్యూట్రిషియన్‌ వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు.భారతదేశంలో సింథటిక్‌ ఔషధాల లభ్యత పెరగడంపై కాంగ్రెస్‌ ఎంపీ అజరు మాకెన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో డ్రగ్స్‌తోపాటు గ్యాంగ్‌వార్‌, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయి. డ్రోన్ల ద్వారా సరిహద్దు అవతలి నుండి భారతదేశానికి డ్రగ్స్‌, మందుగుండు సామాగ్రి చేరుకుంటున్నాయి. కానీ వాటిని మనం ఆపలేకపోతున్నాం అని మాకెన్‌ ఆరోపించారు.జలశక్తి గ్రాంట్లకు సంబంధించి చర్చ సందర్బంగా.. భారత్‌ ఆదివాసీ ఎంపి రాజ్‌కుమార్‌ రోట్‌.. గెహ్లాట్‌ ప్రభుత్వం ఆమోదించిన గిరిజన ప్రాంతాల్లోని ప్రాజెక్టులను బిజెపి రాజస్తాన్‌ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని ఆయన ప్రశ్నించారు. అలాగే కర్ణాటక ఎంపి డాక్టర్‌ ప్రభా మల్లికార్జున్‌ జల్‌శక్తి మిషన్‌, అటల్‌ భుజల్‌ యోజన కోసం కేంద్రం నిధులు వినియోగించడంలేదని ఆయన హైలెట్‌ చేశారు. – ఆశావర్కర్ల జీతాలను పెంచాలని కేంద్రం యోచిస్తుందా అని ఆజాద్‌ సమాజ్‌పార్టీ ఎంపి చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. ఈ సమస్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించింది కాదు. దానికి విడిగా సమాధానం ఇస్తామని, ఆశాకార్యకర్తల పట్ల కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ సమాధానమిచ్చారు.– రాజ్యసభలో బిజెపి ఎంపి సుధాన్షు త్రివేది.. ప్రతిపక్ష ఎంపీలు గాజా గురించే ప్రస్తావిస్తారు. కానీ బంగ్లాదేశ్‌ గురించి చర్చకు తీసుకురారు అని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. ‘మీ డిక్టేటర్‌షిప్‌ ఆపండి’ అని ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos