ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఆహ్వానించారు. రాజ్ ఠాక్రేకు స్వయంగా ఫోన్ చేసి గురువారం సాయంత్రం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు. ఉద్ధవ్ ఠాక్రే చిన్న్నాశ్రీకాంత్ ఠాక్రే కుమారుడే రాజ్ ఠాక్రే. గతంలో ఆయనా శివసేనలోనే ఉన్నారు. 2004లో పార్టీ సారథ్య బాధ్యతల విషయంలో ఠాక్రే కుటుంబంలో విబేధాలు తలెత్తాయి. శివసేన అధినేత బాల్ఠాక్రే తన కుమారుడు ఉద్ధవ్ను తన రాజకీయవారసుడుగా ప్రకటించారు. ఆ తర్వాత మహా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, శివసేన నేత నారాయణ్ రాణెను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో పార్టీలో అంతర్గత విభేదాలు ముదిరి పోయాయి. దరిమిలా శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) పేరు తో కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి సోదరులిద్దరి మధ్యా బంధాలు తగ్గిపోయాయి. అయితే ఇటీవల ఉద్ధవ్-రాజ్ ఠాక్రేల బంధం మళ్లీ చిగురిస్తున్నట్లు కన్పిస్తోంది. ఆ మధ్య రాజ్ ఠాక్రే కుమారుడి పెళ్లికి ఉద్ధవ్ కుటుంబసమేతంగా హాజర య్యారు. అంతేగాక.. రాజ్ ఠాక్రేపై ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనూ ఉద్ధవ్ ఆయనకు మద్దతిస్తూ వ్యాఖ్యలు చేశా రు.