న్యూఢిల్లీ: భాజపా నాయ కత్వంపై కాంగ్రెస్ పార్టీ పెంచుతున్న విమర్శల దాడిని హుందాగా తిప్పి కొట్టాలని మంగళ వారం ఇక్కడ జరిగిన పార్టీ పార్ల మెంటరీ సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సూచించారు. ప్రధానిని ‘చొరబాటుదారు’గా, దేశ ఆర్థిక మంత్రిని ‘నిర్బల’గా విపక్షాలు సంబోధించినప్పుడు తిప్పికొట్టేందుకు సభ్యులు సిద్ధంగా ఉండాలన్నారు.సభా మర్యాదను విస్మ రిం చరాదని హితవు పలికారు. ‘సభ్యతా యుతమైన బాషను వాడాలి, పరుష పద జాలం వాడవద్దు’ కోరారు.