చాలా ఏళ్ల అనంతరం గరుడవేగ రూపంలో విజయం దక్కడంతో రాజశేఖర్‌లో కొత్త ఉత్సాహం ఉట్టిపడుతోంది.పైగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు జరుగనున్న ఎన్నికల్లో వైస్‌ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఎనిమిదేళ్ల క్రితం నటించిన అర్జున చిత్రానికి ఇపుడు మోక్షం కలుగుతోంది.గరుడవేగకు ముందు రాజశేఖర్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేంది.రాజశేఖర్ నటించిన ప్రతీ చిత్రం పరాజయం పాలవడంతో అసలు రాజశేఖర్ చిత్రాలు విడుదలవడం కూడా ఆగిపోయింది. అయితే ప్రస్తుతం రాజశేఖర్ పరిస్థితిలో కొంచెం మార్పు రావడంతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు రాజశేఖర్‌తో అర్జున చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు ఆ సినిమాను ఇపుడు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. మార్చి 15న అంటే మరో వారం రోజుల్లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సినిమాకు పెద్దగా పబ్లిసిటీ లేకుండా వంద లోపు థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల విషయంలో రాజశేఖర్ ఆసక్తిగా లేడని తెలుస్తోంది.రాజశేఖర్ సినిమా ఫలితంను ముందే ఊహించాడో ఏమో కాని విడుదలకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అయినా కూడా నిర్మాతలు పట్టువదలకుండా సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా ఈ చిత్రంలో రాజశేఖర్ యువకుడు,వృద్ధుడిగా ద్విపాత్రాభినయంలో నటించడం విశేషం..