తారక్ సినీ కెరీర్‌లో పరమ డిజాస్టర్ చిత్రాల్లో శక్తి చిత్రం మొదటిస్థానంలో ఉంటుంది.మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిగిల్చిన నష్టాల బారి నుంచి బయట పడడానికి నిర్మాత అశ్వనీదత్‌కు చాలా ఏళ్లు పట్టింది.శక్తి డిజాస్టర్ నుంచి కోలుకొని గత ఏడాది మహానటి చిత్రంతో అశ్వనీదత్ రీ ఎంట్రీ ఇచ్చారు.శక్తి చిత్రం గురించి అశ్వనీదత్ ఇటీవల ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.అశ్వనీదత్ మాట్లాడుతూ… మెహర్ రమేష్ చెప్పిన శక్తి కథ విపరీతంగా నచ్చి తారక్ తో సినిమా చేద్దామని నిర్ణయించుకున్నా.అందుకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే అనుకోకుండా రజనీకాంత్ గారు కలిసారు. అప్పుడే తారక్ తో శక్తి సినిమా చేస్తున్నానని ఆయనకు వెల్లడించాను.ఆయన వెంటనే శక్తి పీఠాలపై సినిమాలు చేయడం మంచిది కాదు…తీయవద్దు అని గట్టిగానే చెప్పారు. కానీ అప్పుడు ఆయన మాట వినిపించుకోలేదు. మొండిగా ముందుకెళ్లిపోయాను. ఆ తర్వాత శక్తి ఫలితం గురించి మీ అందరికీ తెలిసిందే“నని గుర్తు చేసుకున్నారు..