జైపూర్: కేంద్రం ఒత్తిడి కారణంగానే గవర్నర్ కల్రాజ్ మిశ్రా తమతో భేటీకి నిరాకరించినటు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ శుక్రవారం ఇక్కడ ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్లలో ప్రభుత్వాల్ని కూల్చిన విధంగానే రాజస్తాన్లోనూ కమలనాథులు కుట్ర పన్నారని విమర్శించారు. ‘శాసనసభలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నాం. ఎవరి బలమెంతో అక్కడే తేలుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారు.బలాన్ని నిరూపించుకుని తీరతామ’ని దీమా వ్యక్తం చేశారు. కొందరు అసంతృప్త నేతలు కూడా దిగువ సభకు వచ్చే అవకాశం ఉందన్నారు. ‘కేంద్రం నుంచి ఒత్తిడి వస్తున్న కారణంగానే గవర్నర్ తమను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. రాజ్భవన్ను ప్రజలు ముట్టడిస్తే తాము బాధ్యత వహించబోమ’న్నారు. అశోక్ గెహ్లోత్ ఆరోపణలను కల్రాజ్ మిశ్రా ఖండించారు. కరోనా తరుణంలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయడం సబబు కాదని వివరించారు.