అమరావతి :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలిపింది.అల్పపీడనం ఒడిశా వైపు కదులుతోందని వివరించింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.