తిరువనంతపురం : కేరళ అంతటా రానున్న 72 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ (ఐఎండి) బుధవారం హెచ్చరించింది. రాష్ట్రంలో కొన్ని ఎంపిక చేసిన జిల్లాలకు ఐఎండి ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించగా, రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలను రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లో ఉంచుతున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. వయనాడ్ విపత్తును దృష్టిలో ఉంచుకుని . కేరళ ప్రభుత్వం పలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. హైరేంజ్లు, కొండ ప్రాంతాలను నిశితంగా పర్యవేక్షించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున వయనాడ్ జిల్లాలోని పుత్తుమలలో నివాసితులను ముందస్తు జాగ్రత్తగా సహాయక శిబిరానికి తరలించినట్లు తెలిపారు.