ఈ సారి దండిగా వానలు

ఈ సారి దండిగా వానలు

న్యూఢిల్లీ : ఈ వర్షాకాలంలో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈశాన్య భారతదేశంలో ఈసారి సాధారణం కంటే తక్కువగా, వాయవ్య భారతంలో సాధారణంగా, మధ్య, దక్షిణ భారతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రధాన సంచాలకుటు మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. కేరళకు అనుకున్న సమయంలో రుతుపవనాలు రావడానికి ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా వున్నాయన్నారు. జూన్ నుండి సెప్టెంబరు వరకు సాగే వ ర్షాకాలంలో 106 శాతం వర్ష పాతం నమోదయ్యే అవకాశం వుంది. సుదీర్ఘ కాల సగటు వర్షపాతం 87సెంటిమీటర్లు వుంది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లు ప్రధానంగా వర్షపాతం మీదే ఆధారపడే వ్యవసాయం సాగించే ప్రాంతాలుగా వున్నాయి. జూన్లో (సుదీర్ఘకాల సగటు 166.9 మి.మీ.లో 92-108 శాతం) సాధారణ వర్షపాతం కురిసే అవకాశాలు వున్నాయని అంచనా వేసినట్లు చెప్పారు. రుతు పవనాల రాకకు అంతా సానుకూలం మే 31 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు చేరతాయని భావిస్తున్నారు. దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలో మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కన్నా అధికంగా, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భావిస్తున్నట్ల చెప్పారు. రాబోయే ఐదు రోజుల్లో కేరళకు రుతు పవనాలు వచ్చేందుకు పరిస్థితులన్నీ సానుకూలంగా వున్నాయని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos