సతార: భారీ వర్షంలో ఎవ్వరైనా సరే తడవకుండా ఉండేందుకు ప్రయ త్నిస్తారు. కానీ ఎన్నికలు కేంద్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ చే మాత్రం ఆ పని చేయనీ లేదు.శని వారం సతా రాలో శరద్ పవార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారీ వర్షంలో తడుస్తూనే మాట్లాడారు. వర్షంతో దైవం తమను ఆశీర్వదిస్తున్నాడని వ్యాఖ్యానించారు. సతారాలో ఈ సారి ఎన్సీపీ అద్భుతం చేయనుందని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.’నేను గత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఈ నియోజక వర్గంలో సరైన అభ్యర్థిని నిలబెట్టలేదు. పొరబాటును అంగీక రిస్తున్నా. అయితే, ఈ సారి నేను చాలా సంతోషంగా ఉన్నాను.. ఎందు కంటే…ఆ ఎన్నికల్లో చేసిన పొరపాటును సరిదిద్దడానికి అక్టోబరు 21 కోసం సతారా ప్రజలు ఎదురుచూస్తురు. ఈ సారి సరైన అభ్యర్థిని నిల బెట్టాను. వారికే ప్రజలు ఓటు వేస్తార’ని ఆశించారు.