ఏపీపై అల్పపీడన ప్రభావం

ఏపీపై అల్పపీడన ప్రభావం

తాడేపల్లి: ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం నెమ్మదిగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఒడిశా దక్షిణ తీరప్రాంతంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అంతటా పశ్చిమ-వాయువ్య దిశగా మరింత కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో  అల్లూరి, ఏలూరు మరియు ఎన్టీఆర్ జిల్లాలలోని పలు ప్రదేశాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు 28న పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos