అమరావతి: బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఆ తర్వాత అది వాయుగుండంగా బలపడి శనివారం నాటికి తీరం దాటొచ్చని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్, ఇతర వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నుంచి శనివారం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.