హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.