అమరావతి : శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడొ చ్చని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ప్రస్తుతం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పంటలు చేతికి అందివచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. తేలికపాటి జల్లులు అయితే సమస్యలేదు, భారీ వర్షాలు పడితే ఇబ్బందులు తప్ప వంటున్నారు. తెలంగాణలో కూడా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది.. రోడ్లు జలమయం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుండి ఇలా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.