న్యూ ఢిల్లీ:ఆపరేషన్ సిందూర్’ ప్రచారంలో భాగంగా రైలు టికెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని ప్రదర్శించడం రాజకీయ దుమారానికి కారణమైంది. టికెట్లపై మోదీ చిత్రం ఎందుకని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఖర్చు చేసి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటి ప్రచారం చేయడం ఏంటని ప్రభుత్వాన్ని అడిగింది. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ మీడియా సలహాదారు పీజుష్ బాబేల్ ఈ టికెట్ల గురించి సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసి పేర్కొన్నారు. ఇది మోదీ ప్రభుత్వం ప్రకటన. వారు ఆపరేషన్ సిందూర్‌ను ఒక ప్రకటనగా ఉపయోగించి, రైల్వే టికెట్లపై పోస్టర్‌లా ప్రదర్శించారు. సైనిక వీరత్వాన్ని ఇప్పుడు వారు ఉత్పత్తిగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇది జాతీయత కాదని వ్యాఖ్యానించారు.