న్యూ ఢిల్లీ: బెంగళూరు వెళ్లే కర్ణాటక ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ రావటంతో రైలు బుధ వారం అనంతపురంలో ఆగింది. అప్పటికే అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్, పోలీ సులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లభించకపోయేసరికి రైలును పంపించివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆ దారి లో వెళ్తున్న అన్ని రైళ్లలో తనిఖీలు చేపడుతున్నారు.