కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభకు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో శనివారం రాహుల్ బహిరంగ సభ ఏర్పాటైంది. మధ్యాహ్నం మూడు గంటలప్పుడు రాహుల్ సభా వేదిక వద్దకు వచ్చారు. అప్పటికే భారీ సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో సభా ప్రాంగణంలో కూర్చోవడానికి సరైన ఏర్పాట్లు చేయలేదంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలను వీఐపీ జోన్లోకి విసిరి కొట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.