ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి తాను మద్దతునిస్తానని, అయితే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఎన్నికల్లో మోదీని ఓడించడమే తమ పార్టీ లక్ష్యమని ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాంగ్రెస్‌కు మోదీ అంటే ప్రేమ ఉండొచ్చేమో కానీ తాను మాత్రం ఆయనను అసహ్యించుకుంటానని చెప్పారు. బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రధాని పదవికి రేసులో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రధాని కావాలనే కోరిక తనకు ఎంత మాత్రం లేదని, డిల్లీకి హోదా ఇచ్చే ఎవరికైనా తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మోదీ, అమిత్ షా ద్వయం తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలనేదే తమ పార్టీ లక్ష్యమన్నారు.