డిబ్రూగఢ్: అబద్ధాలు అడడానికి తాను నరేంద్ర మోదీని కాదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అసోం టీ కార్మికులకు రూ.351 ఇస్తామని వాగ్దానం చేసిన భాజపా రూ.167 మాత్రమే ఇస్తోందని విమర్శించారు. మోదీ చెప్పినట్టు తాను అబద్ధాలు చెప్పనని శుక్రవారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్ ప్రధాని మోదీని దుయ్యబట్టారు. అసోం ప్రజలకు ఐదు భరోసాల్ని ప్రకటించారు. అవి- టీ కార్మికులకు రూ.375 వేతనం, పౌరసత్వ సవరణ చట్టం అమలు కాకుండా ఆపేయటం. ఐదు లక్షల ఉద్యోగాలు కల్పన, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా, గృహిణులకు రూ.2000 ఫించను . టీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు గదులలో కూర్చుని కాకుండా టీ కార్మికులు, ప్రజలతో చర్చించి భరోసాల్ని రూపొందించామని చెప్పారు.