రాహుల్‌కు ముద్దు

రాహుల్‌కు ముద్దు

తిరువనంతపురం : కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి ముద్దు అనుభవం ఎదురైంది. అయితే ఈసారి అమ్మాయి కాదు అబ్బాయి. తన సొంత నియోజకవర్గం వయనాడ్‌లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని దగ్గరకు వచ్చి తొలుత షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. తర్వాత చేయి పట్టుకుని లాగి రాహుల్‌ బుగ్గపై ముద్దు పెట్టి వేగంగా వెళ్లిపోయాడు. ఈ హఠాత్పరిణామానికి రాహుల్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే తేరుకుని అక్కడున్న వారిని పలుకరిస్తూ ముందుకు సాగాడు. గుజరాత్‌లో పర్యటిస్తున్నప్పుడు కూడా ఓ మహిళ అనూహ్యంగా రాహుల్‌ను ముద్దు పెట్టుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos