శివసేనతో పొత్తు రాహుల్‌కు ఇష్టం లేదా?

శివసేనతో పొత్తు రాహుల్‌కు ఇష్టం లేదా?

మతతత్వ పార్టీగా ముద్ర పడిన శివసేనతో పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటం రాహుల్ గాంధీ ఎంత మాత్రమూ ఇష్టం లేదని తెలుస్తోంది.శివసేనతో చేతులు కలపడాన్ని రాహుల్‌ ముందు నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. నేపథ్యంలోగురువారం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజర్ కావాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఆహ్వానం అందినప్పటికీ.. ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకూడదని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తనకు మాత్రం ఇష్టం లేదనే విషయాన్ని రాహుల్ గాంధీ రకంగా వ్యక్తం చేసినట్లు అవుతుందని అంటున్నారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వాన పత్రాలను పంపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos