న్యూ ఢిల్లీ: దేశ సరిహద్దుల్లో రైతుల బిడ్డలు ప్రాణాలు లెక్కచేయకుండా పహారా కాస్తుంటే.. వారి కోసం దిల్లీ సరిహద్దుల్లో మేకులు పాతిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతు నిరసనలు వందో రోజుకు చేరుకున్న సందర్భంగా కేంద్రాన్ని విమర్శించారు. “దేశ సరి హద్దు ల్లో తమ కొడుకులు ప్రాణాలు పణంగా పెట్టి కాపలా కాస్తుంటే.. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న వారి కోసం రహదారులపై మేకులు పాతారు. అన్నదాతలు హక్కు ల కోసం పోరాడుతుంటే.. వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.” అని హిందీలో ట్వీట్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి.. కనీస మద్దతు ధరకు చట్ట పరంగా హామీ ఇవ్వాలనే డిమాండ్తో గతేడాది నవంబరు 28 తేదీ నుంచి.. దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన టిక్రీ, సింఘు, గాజీపుర్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నా రు అన్నదాతలు. ఈ ప్రతిష్టంభన తొలగించడానికి కేంద్రానికి రైతుల మధ్య 11 సార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది.