
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి కేంద్రంలో రాజ్యాధికారాన్ని చేపడితే వ్యక్తి కనీస ఆదాయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోమవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం సమావేశం తర్వాత ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు . ‘దేశ పేదలకు కనీస ఆదాయ భరోసా పథకాన్ని అమలు చేస్తాం. .ఇందువల్ల దేశంలో ఇరవై శాతం మందికి లబ్ధి చేకూరుతుంది. ఐదు కోట్ల కుటుంబాల్లోని 25 కోట్ల మంది పేదలకు దీని ప్రయోజనం లభిస్తుంది. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో నేరుగా ఏడాదికి రూ.72,000 వేస్తాం. దీని కోసం అన్ని గణాంకాలను సరి చూసుకున్నాం. ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావట్లేద’ని విశదీకరించారు. . 21వ శతాబ్దంలోనూ పేదరికం అధికంగా ఉందని, దాని అంతానికి చివరి వరకూ పోరాటాన్ని సాగిస్తామని చెప్పారు.