న్యూ ఢిల్లీ : వలస కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కేంద్రానికి విన్నవించారు. కేంద్రం కనసీ కనీసం ఈ సారైనా బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ‘వలస కార్మికులు మళ్లీ తిరుగుముఖం పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఖాతాల్లో నగదు నేరుగా జమ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది” అని రాహుల్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ చర్యలకు బదులు కోరనా వ్యాప్తి జరుగుతోందంటూ ప్రజలపై నింద వేయాలనుకుంటున్నారా? అనీ కేంద్రాన్ని ప్రశ్నించారు.