న్యూఢిల్లీ : రైతు ఉద్యమానికి సంఘీ భావంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సారథ్యంలో ఆ పార్టీ పార్లమెంటు సభ్యుల బృందం గురువారం ఇక్కడి విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాద యాత్ర చేయనున్నారు. తర్వాత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన రెండు లక్షల సంతకాల పత్రాల్ని సమర్పించనున్నారు. నూతన చట్టాల రద్దు కోసం రాష్ట్రపతి కోవింద్ జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణను చేపట్టింది.