పాట్నా: ఓట్ల చోరీకి సంబంధించి త్వరలోనే హైడ్రోజన్ బాంబు లాంటి సమాచారాన్ని తమ పార్టీ విడుదల చేయబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వెల్లడించారు. సోమవారం ఇక్కడ జరిగిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్య చేశారు. ఆ సమాచారాన్ని తాము విడుదల చేశాక ప్రధాని మోదీ ఇక తన మొహాన్ని దేశానికి చూపించలేరన్నారు. హైడ్రోజన్ బాంబు అనేది ఆటమ్ బాంబు కంటే పెద్దదని, దాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఓట్ల చోరీతో ముడి పడిన వాస్తవాలను దేశ ప్రజలు తెలుసుకోబోతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు.