అమిత్ షా పరువునష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్

అమిత్ షా పరువునష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్

రాంచి:కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం ఝార్ఖండ్‌లోని చాయ్‌బాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు ఆయన హాజరయ్యారు. రాహుల్ గాంధీ హాజరు అనంతరం న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2018లో చాయ్‌బాసాలో జరిగిన ఓ బహిరంగ సభలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం, రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి జూన్ 26న హాజరు కావాల్సి ఉండగా, ఇతర కార్యక్రమాల కారణంగా తేదీని మార్చాలని రాహుల్ తరఫు న్యాయవాది ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో ఆగస్టు 6న హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos