న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి బీహార్ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ జరగనుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానించారు. తన ఎక్స్ అకౌంట్లో ఈ మేరకు అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రిగ్గింగ్‌పై తను ఒక పత్రికలో రాసిన రాహుల్ కథనాన్ని దీనికి జత చేశారు.రిగ్గింగ్ ప్రజాస్వామ్యానికి 2024 మహారాష్ట్ర ఎన్నికలు బ్లూప్రింట్ అని విమర్శించారు. అయిదు దశల్లో రిగ్గింగ్ జరుగు తుందన్నారు. నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చటంతో అక్రమాలు మొదలవుతాయన్నారు. రిగ్గింగ్‌ను మ్యాచ్ ఫిక్సింగ్‌తో పోల్చారు. చీటింగ్ చేసిన పార్టీ గెలుస్తుందని, కానీ దాని వల్ల వ్యవస్థలన్నీ నష్టపోతాయన్నారు. ప్రజల్లో విశ్వాసం నాశనం అవుతుందన్నారు. మహారాష్ట్రలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ .. త్వరలో బీహార్ ఎన్నికల్లో జరుగ బోతోందన్నారు. మ్యాచ్ ఫిక్స్ ఎన్నికలు ఏ ప్రజాస్వామ్య దేశానికైనా విషం లాంటిందన్నారు.