మీరట్: నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శకు ఇక్క డకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని మంగళవారం పట్టణ శివా ర్లలోనే పోలీసులు అడ్డుకున్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున వెనక్కి వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో రాహుల్, ప్రియాంక తిరుగు ముఖం పట్టారు. ‘పోలీసుల వద్ద నిషేధ ఉత్తర్వులైనా ఉన్నాయాని మేము అడిగాం. వాళ్లు ఎలాంటి ఉత్తర్వులు చూపిం చ లేదు. దయచేసి వెనక్కి వెళ్లిపోండ’ని కోరినట్లు రాహుల్ విలేఖరులకు తెలిపారు.‘దీంతోమా పర్యటన వాయిదా వేసుకు న్నాం. ముగ్గురు వంతున వెళ్లేందుకైనా అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరినా ప్రయోజనం లేకుండా పోయింద’ని వివరిం చారు. మీరట్ గతవారం జరిగిన నిరసనల్లో ఆరుగురు మృతిచెందారు.