సత్యం ఎల్లప్పుడూ నియంతృత్వంపై గెలుస్తుంది

సత్యం ఎల్లప్పుడూ నియంతృత్వంపై గెలుస్తుంది

న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహమ్మద్ జుబెయిర్ను అరెస్టు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్లో, బీజేపీ విద్వేషం, మతఛాందసత్వం, అబద్ధాలను బయటపెట్టే ప్రతి వ్యక్తి వారికి ముప్పేనని తెలిపారు. సత్యం పలికే ఓ గళాన్ని అణచివేస్తే, వెయ్యి గళాలు అదనంగా ఉద్భవిస్తాయని హెచ్చరిం చారు. సత్యం ఎల్లప్పుడూ నియంతృత్వంపై గెలుస్తుందని భరోసా ఇచ్చారు. భయపడవద్దని అందరినీ కోరారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ట్వీట్లో, ముస్లింలకు వ్యతిరేకంగా నరమేధం జరగాలని ఇచ్చిన నినాదాలపై ఢిల్లీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరు. కేవలం విద్వేష ప్రసం గాలను రిపోర్టు చేయడం, తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడం నేరాలుగా పరిగణించి వేగంగా చర్యలు తీసుకుంటారని విమర్శించారు. భాజపా బూటకపు వార్తలను ప్రతిరోజూ బయటపెడుతున్న ప్రపంచంలో అత్యుత్తమ జర్నలిస్టు జుబెయిర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ట్వీట్లో తెలిపారు. ప్రధాని మోదీ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా గొప్ప అధికారాన్ని అనుభవిస్తున్నప్పటికీ, వారు పిరికిపందలని ఆగ్రహించారు. 2020నాటి కేసులో జుబెయిర్ను అరెస్టు చేసినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా తెలిపారు. హైకోర్టు ఆయన అరెస్టు కాకుండా గతంలో రక్షణ కల్పించిందన్నారు. దానిని పట్టించు కోకుండా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos