నితీశ్‌కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిశోర్

పాట్నా:బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు వ్యతిరేకంగా జేడీయూ బహిష్కృత నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్ర వారం విప క్షాల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.వారిలో మాజీ ముఖ్య మంత్రి,హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధ్యక్షుడు జితిన్ రాం మాంఝీ, ఆర్ఎస్ఎల్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా ఉన్నారు.ఈ రెండు పక్షాలు కూడా మహా ఘట్ బంధన్లో భాగస్వాములు.కాంగ్రెస్ పార్టీ,ఆర్జేడీని మాత్రం కలుసుకో లేదు.‘నేను రాజకీయ పక్షాన్ని స్థాపించటం లేదు.బిహార్లో అద్భుతమైన మార్పును తీసుకు రావడానికి కృషి చేస్తున్న వారికి మాత్రం ఉమ్మడి వేదిక సృష్టికి ప్రయత్నిస్తున్నానని గతంలో తెలిపారు. గురువారం ‘బాత్ బిహార్ కీ’ఆందోళన ఆరంభించారు. ఇందులో యువకులకు ప్రముఖ స్థానాన్ని కల్పించారు. సభ్యత్వ నమోదూ ప్రారంభమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos