తెలుగు ప్రజలను విస్మరించడం తగునా రాఘవా?

  • In Film
  • April 11, 2020
  • 141 Views
తెలుగు ప్రజలను విస్మరించడం తగునా రాఘవా?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినీ కార్మికులకు,పేదలకు,సహాయ నిధులకు రూ..3కోట్ల విరాళం ప్రకటించి దర్శకుడు రాఘవ లారెన్స్‌ తన పెద్ద మనసు చాటుకున్నాడు.అయితే రాఘవ మంచి పని చేసినా ఒకవైపు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రాఘవ లారెన్స్‌ స్వస్థలం తమిళనాడు రాష్ట్రమే అయినా రాఘవ ఈ స్థాయికి చేరుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ,తెలుగు ప్రేక్షకులే ప్రధాన కారణం.నృత్యదర్శకుడిగా,దర్శకుడిగా,చివరకు హీరోగా సైతం రాఘవకు మొదటిసారి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం తెలుగు చిత్ర పరిశ్రమ,తెలుగు ప్రజలే.ఇంత చేసినా రాఘవ మాత్రం తన సేవా కార్యక్రమాలు,విరాళాలు కేవలం తమిళనాడుకే మాత్రమే పరిమితం చేస్తుండడం తాజాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రకటించిన విరాళంలో సైతం తెలుగు ప్రజలకు,తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక్క రూపాయి సైతం ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తన ఎదుగుదలలో కీలకంగా ఉన్న తెలుగు వారికి కానీ.. తెలుగు సినీ పరిశ్రమకు కానీ ఏమీ చేయలేదు. అందులో కనీసం పది లక్షలైనా తన ఆరాధ్య నటుడైన చిరంజీవి నేతృత్వంలో నడుస్తున్న టాలీవుడ్ కరోనా క్రైసిస్ ఛారిటీ సంస్థకు అందించి ఉండొచ్చు. కానీ అతడికి మనవాళ్లు గుర్తుకు రాలేదు. ఐతే ఇంతకుముందు తన సినిమా ప్రమోషన్ కు వచ్చి చిరంజీవికి తాను చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి చెబితే వెంటనే ఆయన పది లక్షల విరాళాన్ని లారెన్స్ కు అందజేశాడు. అది గుర్తు చేసుకుని అయినా మన వాళ్లకు లారెన్స్ సాయం చేయకపోవడం ట్విట్టర్ లో చిరంజీవి అదే పనిగా విరాళాలు కోరుతుంటే స్పందించకపోవడం లారెన్స్ సంకుచితత్వాన్ని తెలియజేసేదే.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos