న్యూఢిల్లీ: బాపూజీ హంతకుడు గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించిన భాజపా లోక్సభ సభ్యురాలు ప్రజ్ఞా సింగ్ కూడా ఉగ్రవాదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో అభివర్ణించారు. ‘ఉగ్రవాది ప్రజ్ఞా.. ఉగ్రవాది అయిన గాడ్సేను దేశభక్తుడన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇదో దుర్దినం. ఆరెస్సెస్, భాజపా మనసులోని మాటే ఆమె నోటి నుంచి వచ్చిందని’ దుయ్య బట్టారు.