భువనేశ్వర్: ఒడిశాలోని వీర్ సురేంద్ర సాయి టెక్నాలజీ విశ్వ విద్యాలయంలో చేరిన విద్యార్థులకు, రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ రుచి చూపించారు. స్వాగత ఉత్సవం కార్యక్రమానికి జానియర్లను ఆహ్వానించి వారి చెంపలు వాయించారు. అర్ధ నగ్నంగా నృత్యాల్ని చేయించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో సంచలనమైంది. దీనిపై తక్షణ విచారణకు నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యా శాఖ మంత్రి ఆదేశించారు. ర్యాగింగ్కు పాల్పడిన 52 మందిని కళాశాల నుంచి సస్పెండ్ చేసి చెరి రూ.2,000 వంతున జరిమాన విధించారు.