ఢిల్లీ: గత సమావేశాల్లో పార్లమెంట్‌ను రాఫెల్ యుద్ధ విమానాల అంశం షేక్ చేసింది. రాఫెల్ డీల్ అవినీతిమయమంటూ పార్లమెంట్ లోపల.. బయట.. ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురువారం ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి… తాజాగా రాఫెల్ యుద్ధవిమానాల గురించి ప్రస్తావించారు. తన ప్రసంగంలో రక్షణ ఒప్పందాల గురించి ప్రస్తావించిన ఆయన.. దేశ భద్రత కోసమే కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాలతో సరిహద్దులు సురక్షితమన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ అద్భుతమంటూ భారత ఆర్మీని ప్రశంసించారు. నవభారతం నిర్మాణం కోసం నాలుగేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. అవినీతిరహిత భారత్ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. 2019 భారతదేశానికి కీలక సంవత్సరమన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.