న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ నేతలు చిదంబరం, శివ కుమార్కు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ, ఇడి శుక్రవారం అత్యున్నత న్యాయ స్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఇటీవల సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. నగదు అక్రమ బదిలీ శివకుమార్ ఢిల్లీ ఉన్నత న్యాయ స్థానం నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందారు. రూ.లక్ష వ్యక్తిగత పూచి కత్తుపై అత్యున్నత న్యాయస్థానం చిదంబరానికి బెయిల్ మంజూరు చేసినా ఆయనకు జైలు విముక్తి కలిగే అవకాశం లేకుండా పోయింది. ఆయనను ఎన్ఫో ర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.