రాహుల్‌ చేత క్రికెట్ బ్యాట్‌

రాహుల్‌ చేత క్రికెట్ బ్యాట్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్రికెట్ ఆడారు. మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల ప్రచారం, వ్యూహ రచనల్లో రాజకీయులు తీరిక లేకుండా ఉంటే ఆయనకు అంత సమయం ఎక్కడ దొరికింది? శుక్రవారం హరియాణా, మహేంద్రగఢ్ శాసనసభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల ప్రచారాన్ని చేయాల్సి ఉంది. అనారోగ్యం వల్ల ఆమె కార్యక్రమం రద్దయ్యింది. దరిమిలా ఆమెకు బదులుగా రాహుల్ గాంధీ ప్రచార సభకు హాజరయ్యారు. ప్రచారాన్ని ముగించుకొని ఢిల్లీకి హెలికాప్టర్లలో ఎక్కారు. వాతావరణ బాగా లేక పోవటంతో దాన్ని అత్యవసరంగా రివాడీ కేఎల్పీ కళాశాల ఆట మైదానంలో దించారు. అప్పటికే మైదానంలో ఆడుకుంటున్న చిన్నారులు, యువకులతో రాహుల్ కాసేపు క్రికెట్ ఆడారు. కాసేపు వారితో ముచ్చటించారు. తర్వాత రోడ్డు మార్గాన రాహుల్ దిల్లీ చేరారు. . యువకులు బౌలింగ్ చేయటం..రాహుల్ బంతిని కొట్టడానికి ప్రయత్నించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బాగా ఆకట్టుకుంటోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos