శ్రీదేవి జీవితం ఒక సందేశం..

  • In Film
  • March 21, 2019
  • 194 Views
శ్రీదేవి జీవితం ఒక సందేశం..

గత ఏడాది అభిమానులను
శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అతిలోక సుందరి శ్రీదేవిని తలచుకొని
విప్లవ చిత్రాల దర్శకనటుడు ఆర్‌.నారాయణ మూర్తి ఉద్వేగానికి లోనయ్యారు.పసుపులేటి రామారావు
రాసిన అతిలోకసుందరి శ్రీదేవి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి
మాట్లాడారు.శ్రీదేవి చిన్న వయసు నుంచే తనకు తెలుసని దాసరి నారాయణరావు తీసిన బంగారక్క
చిత్రం సమయంలో శ్రీదేవి ఇంకా చిన్నపాపని అప్పటి నుంచే శ్రీదేవిని చూశానన్నారు.16 ఏళ్ల
వయసు అనంతరం శ్రీదేవికి అభిమాన గణం భారీగా పెరుగుతూ వచ్చిందని బాలీవుడ్‌ వెళ్లాక శ్రీదేవి
అభిమానుల సంఖ్య మరింత పెరిగిందన్నారు. అందం, అభినయం, మంచితనం,క్రమశిక్షణ ఇలా అన్ని
కలగలిన వ్యక్తి శ్రీదేవి అన్నారు.మహ్మద్‌ రఫి,రాజేశ్‌ ఖన్నా వంటి సినీ ప్రముఖులు మృతి
చెందినపుడు దేశ ప్రజలు ఎలా బాధ పడ్డారో శ్రీదేవి మరణించినపుడు కూడా అంతే బాధపడ్డారన్నారు.మహానటి
సావిత్రి జీవితం ఆర్థిక క్రమశిక్షణ,ఆరోగ్య క్రమశిక్షణ గురించి పాఠాలు నేర్పితే శ్రీదేవి
జీవితం ఒక్క తప్పటడుగు వేయడం వల్ల జీవితం ఎలా మారిపోతుందో తెలియజేసిందన్నారు.వివాహం
అనంతరం ముంబయికి వెళ్లిపోయిన శ్రీదేవిని ఒకసారి తమ సినిమా సెన్సార్‌ కోసం ముంబయికి
వెళ్లిన తాము కలిసామన్నారు.అప్పుడే శ్రీదేవికి తెలుగు ప్రాంతమన్నా,తెలుగు వ్యక్తులను
ఎంత అభిమానమో తెలిసిందన్నారు.ముంబయికి వచ్చిన తెలుగు వ్యక్తులు తనకు తారసపడితే తన పీఏతో
చెప్పి తెలుగు వ్యక్తులకు చాలా సహాయం చేసేదని గుర్తు చేసుకున్నారు.ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌
చిత్రంపై జరుగుతున్న వివాదాలు గురించి స్పందించి ఒక చిత్రాన్ని సెన్సార్‌ జరగనివ్వకుండా
అడ్డుకుంటుండడం దారుణమన్నారు.రాజీకయాలపై వ్యక్తి జీవితచరిత్రపై సినిమా తీస్తే అడ్డుకుంటారా
వివరణ ఇవ్వడానికి అమరావతి వెళ్లాలా ఇదెక్కడి ప్రజాస్వామ్యమంటూ ఘాటుగా స్పందించారు.అప్పట్లో
ఎన్టీఆర్‌ను విమర్శిస్తూ మండలాధ్యక్షుడు అనే సినిమా తీస్తే అధికారంలో ఉండి కూడా నా
గురించి గొప్పగా తీసినా చూస్తారు..తిట్టినా చూస్తారని సమాధానమిచ్చి ఊరుకున్నారే కానీ
ఇలా అణచివేత ధోరణికి పాల్పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos