ఇరాక్‌ వెళ్లొద్దు

ఇరాక్‌ వెళ్లొద్దు

న్యూఢిల్లీ: ఇరాక్ లోని రెండు అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసినందున అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దరమిలా అత్యవసరమేతై తప్ప భారతీయులెవరూ ఇరాన్,ఇరాక్కు వెళ్లరాదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. తమ తదుపరి ప్రకటన వెలువడేంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇరాక్ లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇరాక్ లో కూడా ఎక్కడకూ ప్రయాణించ కుండా ఉన్న చోటే ఉండిపోవాలని సూచింది. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని మన రాయబారి కచ్చేరీ, ఎంబసీ, ఇర్బిల్ లోని మన కాన్సులేట్ యథాతథంగా పని చేస్తాయని తెలిపారు. ఇరాక్ లోని భారతీయులకు అవసరమైన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంటాయని చెప్పారు. ఇరాక్ లో ఎంతో మంది భారతీయులు నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos