వైకాపా నీడకు పొట్లూరి

వైకాపా నీడకు పొట్లూరి

అమరావతి:ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌   బుధవారం వైకాపాలో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వైకాపా అధినేత జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే  ఆ పార్టీలో చేరదలచినట్లు తెలిసింది.  విజయవాడ లోక్‌సభ స్థానానికి ఆయన పోటీ చేయవచ్చని పార్టీ వర్గాల బోగట్టా. 2014 లోక్‌సభ  ఎన్నికల్లో విజయవాడ నుంచి  తెదేపా అభ్యర్థిగా పోటీకి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. విజయవాడ లోక్‌సభ స్థానానికి  ఈ సారి వైకాపా అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్  పోటీ చేస్తారని భావించారు. అయితే ఇందుకు ఆయన సుముఖంగా లేక పోవటంతో వర ప్రసాద్‌ ఆ అవకాశాన్ని చేజిక్కించు కునేందుకు  వైకాపా తీర్థాన్ని పుచ్చుకుంటున్నారని పరిశీలకుల మదింపు. పొట్లూరిని  నాయకత్వం  బలమైన అభ్యర్థిగా లెక్కగట్టిందని పార్టి వర్గాల కథనం. వరప్రసాద్ కల ఈ సారైన నెరవేరు తుందో లేదో చూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos