ప్రజా వేదిక నుంచి బాబు సామగ్రి తొలగింపు

ప్రజా వేదిక నుంచి బాబు సామగ్రి తొలగింపు

అమరావతి: ప్రజావేదిక భవనంలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తి గత సామగ్రిని ప్రభుత్వ సిబ్బంది బయట పడేశారు. ముందుగా తెలపకుండా హఠాత్తుగా సామాన్లు బయట పడేసారని తెదేపా నేతలు ఆగ్రహించారు. ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు వీలుగా లోపలి సామగ్రిన బయటకు తరలించినట్లు అధికార్లు తెలిపారు. తొలుత వెలగపూడి సచివాలయంలోని అయిదో బ్లాక్‌ సమావేశ మందిరంలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. తాజాగా సమావేశ స్థలాన్ని ప్రజావేదికకు బదిలీ చేసారు. . తన నివాసం పక్కనే ప్రజా వేదిక ఉ న్నందున దాన్ని వాడుకునేందుకు అనుమతించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసారు. దీనికి ఇంకా స్పందన రావాల్సి ఉంది. ఈ దశలో ప్రజావేదికను కలెక్టర్ల సదస్సు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశిం చింది. దరిమిలా శుక్రవారం సాధారణ పరిపాలనశాఖ అధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌ తదితరులు ప్రజావేదిక భవనాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos