ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులంటే విదేశీ ఏజెంట్లు

మాస్కో: రష్యాలోని స్వతంత్ర విలేకరులు, బ్లాగర్లను విదేశీ ఏజెంట్లుగా పరిగణించే కొత్త చట్టంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం సంతకం చేసారు. ఇది తక్షణం అమల్లోకి రానుంది. ఇది వరకూ మీడియా సంస్థలు, ఎన్జీవోలనే విదేశీ ఏజెంట్ లుగా ముద్ర వేసే అవకాశం ఉండేది. తాజా నిర్ణయంతో వ్యక్తులు కూడా ఈ చట్టం పరిధిలోకి రానున్నారు. ఇది మాధ్యమ స్వేచ్ఛను హరించడమేనని ఆమ్నెస్టీ ఇంటర్నెషనల్ వంటి స్వచ్ఛంద సంస్థలు మండి పడ్డాయి. ప్రభుత్వం మాత్రం తన నిర్ణ యాన్ని సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తోంది. విదేశాల్లోని రష్యా జర్నలిస్టులను వేధిస్తే తమ దేశంలోని విదేశీ విలేకరులపై ఈ చట్టాన్ని ప్రయోగిస్తామని తెలిపింది. స్టాలిన్ కాలం నుంచి రష్యాలో విదేశీ ఏజెంట్ అనే పథానికి ప్రత్యేక అర్థం చెలామణీలో ఉంది. పాశ్చత్యా దేశాల అండతో రష్యా వ్యతిరేక కార్యకలాపాలు సాగించేవారిని విదేశీ ఏజెంట్ అని పిలిచేవారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos