శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. వాహనంలో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉంచి దాడికి యత్నించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సరైన రీతిలో స్పందించాయి. బుధవారం రాత్రి 20 కేజీల ఐఈడీతో వెళుతున్న పుల్వామా వద్ద కారును ఆపాయి. కానీ డ్రైవరు ఆగకుండా ముందుకు వెళ్లటానికి ప్రయత్నించినపుడు పోలీసులు కాల్పులు జరిపారు. అతడు బలగాలపై ఎదురు కాల్పులు జరుపుతూ పరారయ్యాడు. అతణ్ని హిజ్బుల్ ఉగ్రవాదిగా గుర్తించారు. నిరుడు పుల్వామాలో జరిగిన ఐఈడీ వాహన దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది మరణించారు.