హోటల్ బిల్లును ఎగ్గొట్టిన నటి పూజా గాంధీ

  • In Film
  • March 19, 2019
  • 184 Views
హోటల్ బిల్లును ఎగ్గొట్టిన నటి పూజా గాంధీ

బెంగళూరు : కన్నడ నటి పూజా గాంధీ మళ్లీ వివాదంలో
ఇరుక్కున్నారు. ఓ హోటల్‌లో బస చేసిన ఆమె బిల్లు కట్టకుండానే చెక్కేశారంటూ పోలీసు స్టేషన్‌లో
ఫిర్యాదు దాఖలైంది. బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్‌లో ఆమె చాలా రోజులు బస చేశారు. బిల్లు
రూ.4.5 లక్షల దాకా అయింది. ఆ మొత్తం చెల్లించకుండానే ఆమె ఖాళీ చేసి వెళ్లిపోయారంటూ,
హోటల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు సమన్లు జారీ చేశారు.
అయితే తాను రూ.2 లక్షలు చెల్లించేశానని, మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి కాస్త గడువు
కోరానని ఆమె  పోలీసులకు తెలిపింది. గతంలో కూడా
ఆమె నిర్మాత కిరణ్‌తో గొడవ పడడంతో, ఇద్దరూ కోర్టు మెట్లు ఎక్కారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos