ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక

ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక

అమరావతి : తెలుగు దేశంలో మాత్రం ప్రజా భిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుండగా వైకాపా వేలం పాట తరహాలో అభ్యర్థుల్ని ఎంపిక చేస్తోందని ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు ఆరోపించారు. మంగళవారం ఇక్కడి నుంచి రా ష్ట్రం లోని వివిధ ప్రాంతాల తెదేపా నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. రాగ ద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తు న్నామని స్పష్టీకరించారు. ఎంపికను అనుమానించే వారికి దాఖలాల్ని వివరించి సందేహ నివృతికి సిద్దంగా ఉన్నామని విశదీకరించారు. పార్టీ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించటాన్ని సహించబోమని తేల్చి చెప్పారు. ‘చింతలపూడిలో రూ.3 కోట్లు ఇస్తానంటే ఒకరికి.. అంత కంటే ఎక్కువ ఇస్తానంటే ఇంకొకరికీ అంటూ వైకాపా అభ్యర్థుల్ని మారుస్తోందని’ ఆరోపించారు.  పని చేసిన వారితో పాటు సామాజిక  న్యాయ ప్రాతిపదికన తమ పార్టీలో అభ్యర్థుల్నిఎంపిక చేసినట్లు విపులీకరించారు.   పోటీకి అవకాశం లభించని వారు పరిస్థితిని అర్థం చేసుకుని పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల్లో ప్రచారానికి సుముఖత వ్యక్తీక రించటం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.  అందరి సేవల్ని  గుర్తించి భవిష్యత్తులో తగిన పదవుల్లో నియమిస్తామనని హామీ ఇచ్చారు. పార్టీకి అండగా నిలబడిన వారిని భవిష్యత్తులో  పార్టీ  పురస్కరిస్తుందని పునరుద్ఘాటించారు. విభజన నాటి పరిస్థితుల్ని  నేటి పరిస్థితులతో అంచనా వేసి ఓటర్లు  తీర్పు ఇవ్వబోతున్నారని ఆశించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల సంఘం
మొదటి దశలోనే నిర్వహించనుండటం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
చివరి దశలో నిర్వహించాల్సిన  ఎన్నికల్ని దురుద్దేశంతోనే
తొలి దశకు మార్చటం వల్ల తమకు ఎంతో మేలు కలిగిందన్నారు. ‘వేసవి ప్రతాపానికి ముందే ఎన్నికలు
ముగియ నున్నందున స్వేచ్ఛంగా ఉంటాం. దేశమంతా తిరగొచ్చు. వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఆయన
ఆశిస్సులు కలకాలం నాకు ఉంది.  24 క్లెమోర్ మైన్స్
ప్రయోగించినా వేంకటేశ్వర స్వామి నా ప్రాణాలు నిలబెట్టారు’అని గతాన్ని గుర్తు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos