పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చైనా కు వ్యతిరేకంగా ఆందోళనలు జోరందుకున్నాయి. చైనా ప్రభుత్వం అక్కడ చేపట్టనున్న ప్రాజెక్టులకి వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి ముజఫరాబాద్ లో భారీ నిరసన ప్రదర్శన చేసారు. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ నీలం-జీలం నదులపై జల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఆ రెండు దేశాల మధ్య జూన్ లో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పీవోకే లో ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముజఫరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ‘నదిని కాపాడుకుందాం.. ముజఫరాబాద్ ను కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. చైనాపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ .. చైనా జాతీయ జెండాలను తగులబెట్టారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చైనా కు వ్యతిరేకంగా ఆందోళనలు జోరందుకున్నాయి. చైనా ప్రభుత్వం అక్కడ చేపట్టనున్న ప్రాజెక్టులకి వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి ముజఫరాబాద్ లో భారీ నిరసన ప్రదర్శన చేసారు. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ నీలం-జీలం నదులపై జల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఆ రెండు దేశాల మధ్య జూన్ లో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పీవోకే లో ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముజఫరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ‘నదిని కాపాడుకుందాం.. ముజఫరాబాద్ ను కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. చైనాపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ .. చైనా జాతీయ జెండాలను తగులబెట్టారు.