ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ఈరోజు జాతీయ రహదారుల దిగ్బంధనం విజయవంతమైంది. దేశంలోని అన్ని ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు,వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలు దిగ్బంధనం చేశారు. పంజాబ్, హర్యానా, పశ్చిమబెంగాల్,కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులు స్తంభించిపోయాయి. ఇందులో భాగంగా విశాఖలోని మద్దిలపాలెం కూడలి వద్ద సిఐటియు, ఎఐటియుసి, ఎఐఎఫ్‌టియు, ఐఎఫ్టియు, ఎస్‌యుసిఐ, పిఎఫ్టియుఐ, పిఒడబ్ల్యూ నాయకులు,కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించొద్దని డిమాండ్ చేశారు. బిజెపి విధానాలను వ్యతిరేకించారు.